మల్లాది వేంకట సుబ్బారావు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు తోపుడుబండ్ల
పంపిణీ
విజయవాడ : సమాజంలో పేద, బడుగు బలహీన వర్గాల వారికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం
ఎల్లప్పుడు అండగా ఉంటుందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్
ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం పర్యటన సమయంలో
పలువురు పేదలు తమ కుటుంబ పోషణ నిమిత్తం దారి చూపవలసిందిగా ఎమ్మెల్యేకు
విన్నవించారు. స్పందించిన ఆయన ఏడుగురికి తోపుడు బండ్లను అందజేశారు. మల్లాది
వేంకట సుబ్బారావు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ఆంధ్రప్రభ కాలనీలోని
జనహిత సదనము నందు ఈ కార్యక్రమం జరిగింది. సమాజ సేవను ప్రతి ఒక్కరూ సామాజిక
బాధ్యతగా తీసుకుని పనిచేయాలని ఈ సందర్భంగా మల్లాది విష్ణు సూచించారు. మన
ఎదుగులలో కీలక పాత్ర పోషించిన సమాజానికి తిరిగి సేవ చేయవలసిన బాధ్యత అందరిపై
ఉందన్నారు. ప్రజల అవసరాలను, సమస్యలను గుర్తించి మానవతా దృక్పథంతో ఆదుకోవాలని
పిలుపునిచ్చారు. అప్పుడే సమాజాభివృద్ధి సాధించడానికి వీలు అవుతుందని
పేర్కొన్నారు. ఈ విషయంలో మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పిన మాటలు తనకు
మార్గదర్శకమని, ఆయన స్ఫూర్తితో 2013లో మల్లాది వేంకట సుబ్బారావు ఛారిటబుల్
ట్రస్ట్ ప్రారంభించినట్లు చెప్పారు. ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబాలకు
జీవనోపాధి కల్పించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే
ట్రస్ట్ ద్వారా ఉచిత రక్తదాన శిబిరాలు, పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ ల
పంపిణీ, హెల్త్ క్యాంపులు, కుట్టు మిషన్లు, ప్లాట్ ఫామ్ రిక్షాలు, తోపుడు
బండ్లు, ఇస్త్రీ పెట్టెలు, క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్ల పంపిణీ వంటి ఎన్నో
కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించినట్లు వెల్లడించారు. కరోనా సమయంలోనూ
పేదలకు ఉచితంగా ఆహారం, మందులను పంపిణీ చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో
సేవలను మరింత విస్తృతం చేస్తామని తెలియజేశారు. సామాజిక బాధ్యతగా తాను
చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రజల ఆదరాభిమానాలు ఎల్లవేళలా ఉండాలని
ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు కొండాయిగుంట
మల్లీశ్వరి బలరాం, బంకా శకుంతల భాస్కర్, కొంగితల లక్ష్మీపతి, నాయకులు చినబాబు,
బంకా బాబి, గుర్రం ఏడుకొండలు, బి.వసంత్ కుమార్, లోకేష్, కొండాయిగుంట రాము,
కుమార్, లబ్ధిదారులు పాల్గొన్నారు.