తొలుత సికింద్రాబాద్ నుంచి కాజీపేట మీదుగా విజయవాడ వరకు
రెండో విడతలో విశాఖపట్నం వరకు పొడిగింపు
గుంటూరు : రైల్వే శాఖ రాష్ట్రానికి రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను
కేటాయించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర రైల్వే శాఖ నుంచి వర్తమానం
అందింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను 2023
జనవరిలో సికింద్రాబాద్–విజయవాడ మధ్య నడపాలని నిర్ణయించారు. త్వరలోనే
అధికారికంగా తేదీని ఖరారు చేస్తారు. గంటకు 165 కి.మీ. వేగంతో
ప్రయాణించడంతోపాటు 1,129 సీటింగ్ సామర్థ్యం కలిగిన ఈ రైలును మొదట
సికింద్రాబాద్ నుంచి కాజీపేట మీదుగా విజయవాడ వరకు నడుపుతారు. తరువాత
విశాఖపట్నం వరకు పొడిగిస్తారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రెండో
వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్–తిరుపతి మధ్య నడపనున్నారు. ఈ
రైలును సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా తిరుపతి వరకు నడపాలని దక్షిణ మధ్య
రైల్వేవర్గాలు భావిస్తున్నాయి. ఈ రైలు రూట్‌పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.