ఎయిర్ పోర్టులో స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాల్క సుమన్
హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొనేందుకు కర్ణాటక
మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు.
బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న కుమారస్వామికి శంషాబాద్
విమానాశ్రయంలో పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్
జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి, చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్
బాల్క సుమన్ లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి, సుమన్ లు
పూలమాలలు, శాలువాలతో కుమారస్వామిని సన్మానించి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం
కుమార స్వామి, ఆయన వెంట వచ్చిన పలువురు కర్ణాటక రాష్ట్ర నేతలు బీఆర్ ఎస్
నాయకులతో కలిసి తెలంగాణ భవన్ కు వెళ్లారు.