కీవ్ : యుద్ధాన్ని ఆపాలా.. వద్దా అన్న విషయం నిర్ణయించుకోవాల్సింది
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీయేనని రష్యా స్పష్టం చేసింది. ఆయన
కావాలనుకుంటే రేపే యుద్ధం ముగుస్తుందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ
పెస్కొవ్ తాజాగా తెలిపారు. అమెరికాకు చెందిన ప్రముఖ బాస్కెట్బాల్
క్రీడాకారిణి బ్రిట్నీ గ్రైనర్ను రష్యా విడుదల చేసింది. ఖైదీల మార్పిడి
ఒప్పందంలో భాగంగా రష్యాకు చెందిన ఆయుధాల వ్యాపారి విక్టర్ బౌట్ను అమెరికా
విడుదల చేయడంతో గ్రైనర్ను రష్యా ఆమె స్వదేశానికి పంపింది. ఈ సందర్భంగానే
పెస్కొవ్ మాట్లాడారు. రష్యా షరతులను ఉక్రెయిన్ అంగీకరిస్తేనే యుద్ధం
ఆగుతుందని రష్యా ఎప్పట్నుంచో చెబుతోంది. క్రిమియాను రష్యాలో అంతర్భాగంగా
ఉక్రెయిన్ గుర్తించాలని క్రెమ్లిన్ డిమాండు చేస్తోంది. కానీ జెలెన్స్కీ,
ఇతర ఉక్రెయిన్ నేతలు మాత్రం రష్యా ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి అప్పగిస్తేనే
యద్ధం ముగుస్తుందని చెబుతున్నారు. పుతిన్ కూడా ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘ
ప్రక్రియగానే ఉంటుందని వ్యాఖ్యానించారు.