హ్యూస్టన్ : భారతీయ అమెరికన్ కృష్ణ వావిలాలను అమెరికాలోనే అత్యున్నత
పురస్కారమైన ప్రెసిడెన్షియల్ జీవితకాల సాఫల్య పురస్కారం (పీఎల్ఏ) వరించింది.
హ్యూస్టన్‌కు చెందిన ఆయన ప్రవాస భారతీయ సమాజానికి, అమెరికాకు పెద్దఎత్తున
చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. అమెరికా ప్రభుత్వానికి చెందిన
అమెరికా కోర్ నేతృత్వంలో జరిగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారిలో అత్యుత్తమ
అంకితభావం ప్రదర్శించిన వారిని ఏటా పీఎల్ఏ పురస్కారం వరిస్తుంది. ఈ సంస్థ
కింద 50 లక్షల మంది అమెరికా పౌరులు వివిధ కార్యక్రమాల క్రింద అనేక రంగాల్లో
సేవలు అందిస్తున్నారు. ఈ మేరకు గతవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో అమెరికా
కోర్ సర్టిఫయర్ డాక్టర్ సోనియా ఆర్ వైట్ వావిలాలకు పురస్కారాన్ని ప్రదానం
చేశారు. ఇందులో శ్వేతసౌధం నుంచి అధ్యక్షుడు బైడెన్ సంతకం చేసిన
ధ్రువీకరణపత్రం, మెడల్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో కృష్ణ వావిలాల సతీమణి
ప్రభాత్ లక్ష్మీ, కుమార్తెలు, మోనికా, అమండ, నలుగురు మనవలు హాజరయ్యారు.
‘‘అనూహ్యంగా లభించిన ఈ గౌరవం నన్ను కదిలిచింది. హ్యూస్టన్‌లోని భారతీయులకు
అందించిన సేవలకు ఇది నిజమైన గుర్తింపు’’ అని పురస్కార ప్రదానోత్సవంలో కృష్ణ
పేర్కొన్నారు. 2006లో హ్యూస్టన్ వర్సిటీలో ఇండియా స్టడీస్ పోగ్రామ్‌ను
వావిలాల స్థాపించారు. ఈ ఏడాది ప్రారంభంలో టెక్సాస్‌లోని సదరన్
యూనివర్సిటీలోనూ ఇండియా స్టడీస్ ప్రోగ్రామ్ ప్రారంభించడంలో ఆయనదే ముఖ్య
పాత్ర.