హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడకు
చెందిన వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ ఘటన తనను షాక్కు గురి
చేసిందన్నారు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్. యువతి భద్రతపై ఆందోళన
చెందుతున్నట్లు ట్విటర్లో వెల్లడించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా
శిక్షించాలన్నారు. యువతి కుటుంబానికి భద్రత కల్పించాలని తెలంగాణ డీజీపీని
కోరారు తమిళిసై. యువతి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే : అపహరణకు గురైన
వైద్య విద్యార్థిని వైశాలి కుటుంబ సభ్యులను మన్నెగూడకు వెళ్లి పరామర్శించారు
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా బాధితురాలి
కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. నిందితులను కఠినంగా
శిక్షించాలని, బాధిత కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.