హైదరాబాద్ : ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన 5గంటలకు పైగా రాష్ట్ర
మంత్రి వర్గం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక అంశాలపై
చర్చించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, దళితబంధు, రైతు బంధు, పోడు భూముల
వ్యవహారంపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. వీటితో పాటు పలుశాఖల్లో పోస్టుల
భర్తీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ సంక్షేమశాఖలోని పలు
గురుకులాల్లో కొత్త ఉద్యోగాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2,591 పోస్టులను
బీసీ సంక్షేమశాఖలోని గురుకులాల్లో భర్తీ చేయాలని నిర్ణయించింది. రహదారులు,
భవనాల శాఖను పునర్ వ్యవస్థీకరించాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కేబినెట్
అందుకు అనుగుణంగా 472 అదనపు పోస్టులను మంజూరు చేసింది. వాటిలో 3 సీఈ, 12
ఎస్ఈ, 13 ఈఈ, 102 డీఈఈ, 163 ఏఈఈ పోస్టులు ఉన్నాయి. కాలానుగుణంగా రోడ్ల
మరమ్మతులు చేపట్టేందుకు రూ.1865 కోట్లు మంజూరు చేయాలని కేబినెట్
తీర్మానించింది. పెరుగుతున్న జనాభా, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా పోలీసు
శాఖలో కొత్తగా సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టుల భర్తీకి
మంత్రివర్గం ఆమోదం తెలిపింది.