కెనడా : కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్(రాష్ట్రం) నూతన మంత్రివర్గంలో
ఐదుగురు భారత సంతతి వ్యక్తులకు తాజాగా చోటు దక్కింది. బ్రిటిష్ కొలంబియా
ప్రావిన్స్ ప్రభుత్వ ప్రీమియర్(అధినేత) డేవిడ్ ఈబై ఇటీవల చేపట్టిన మంత్రివర్గ
పునర్వ్యవస్థీకరణలో ఐదుగురు ఎన్నారైలకు ఈ సువర్ణావకాశం లభించింది. అటార్నీ
జనరల్‌గా నికీ శర్మ, విద్య, శిశు సంరక్షణ శాఖ మంత్రిగా రచనా సింగ్, హౌసింగ్
శాఖ, శాసనసభాపక్షనేతగా రవీ కహ్లాన్, వాణిజ్య శాఖ మంత్రిగా జగ్రూప్ బ్రార్,
కార్మిక శాఖ మంత్రిగా హార్రీ బెయిర్స్ ఎంపికయ్యారు. కాగా కొత్త మంత్రివర్గంలో
23 కేబినెట్ మంత్రులు, నలుగురు సహాయ మంత్రులు, 14 పార్లమెంటరీ సెక్రెటరీలు
ఉన్నారు. ఇక కెనడాలో హింసాత్మక నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో నికీ శర్మ
అటార్నీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు. ‘‘నాకు ఇటీవల ఓ రోజు ప్రీమియర్ నుంచి
ఫోన్ వచ్చింది. నిన్ను అటార్నీ జనరల్‌గా ఎంపిక చేసినట్టు ఆయన చెప్పారు. అంతే ఆ
తరువాత ఆయన చెప్పిన దాంట్లో ఏదీ గుర్తులేదు’’ అంటూ నికీ హర్షం వ్యక్తం చేశారు.
ఆ ప్రావిన్స్ అటార్నీగా ఎంపికైన తొలి దక్షిణాసియా సంతతి మహిళగా నికీ చరిత్ర
సృష్టించారు. బ్రిటీష్ కొలంబియా వాసులు కష్టాలు తొలగించేందుకు, జీవనప్రమాణాలు
పెంచేందుకు నూతన మంత్రివర్గం కృషి చేస్తుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.