బాలల సైన్స్ కాంగ్రెస్ కు ఆతిథ్యమిచ్చిన గూడూరు పట్టణం
ముఖ్య అతిథిగా పాల్గొన్న పర్యాటక శాఖ మంత్రి రోజా
గూడూరు : గూడూరు పట్టణంలోని ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి (అప్ కాస్ట్ ) అద్వర్యంలో
నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి 30వ జాతీయ బాలల సైన్స్
కాంగ్రెస్-2022 కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక, క్రీడా, యువజన
అభ్యున్నతి శాఖ మంత్రి ఆర్కే రోజా ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. రెండు రోజుల
పాటు జరిగే 30వ బాలల సైన్స్ కాంగ్రెస్ సమ్మేళనానికి నెల్లూరు జిల్లా గూడూరు
పట్టణం ముస్తాబైంది. శాస్త్రీయ పరిజ్ఞానాన్ని జనానికి చేరువ చేసే దిశగా పలు
ప్రదర్శనలు, సదస్సులు, సమావేశాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో అప్ కాస్ట్ మెంబెర్
సెక్రటరీ అపర్ణ, ఆదిశంకర కాలేజ్ ఛైర్ పర్సన్ పెంచలయ్య, జడ్పీ చైర్మన్ అనం
అరుణమ్మ, సైన్స్ సిటీ సి ఈ ఓ డాక్టర్ కె . జయరాం రెడ్డి, ఎస్ సి ఈ ఆర్ టీ
డైరెక్టర్ బి. ప్రతాప్ రెడ్డి, అప్ కాస్ట్ సిబ్బంది, విద్యార్థులు
పాల్గొన్నారు. 30వ బాలల సైన్స్ కాంగ్రెస్ లో 17 ప్రాజెక్ట్ లకు గాను రాష్ట్ర
స్థాయిలో గెలిచిన జిల్లా వారీగా విద్యార్థులకు బహుమతి, సర్టిఫికెట్, మెడల్
బహుకరించి విద్యార్థులను మంత్రి రోజా అభినందించారు.