-విశ్వేశ్వరరెడ్డి కుటుంబంతో ప్రత్యేక విందు
– పాల్గొన్న ఎమ్మెల్యేలు తోపుదుర్తి, కాపు
అనంతపురం నగరంలో “సన్ రే” ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కి ఘన స్వాగతం లభించింది.
ప్రారంభోత్సవం అనంతరం ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి
ఇంటికి సజ్జల చేరుకున్నారు.ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి, ఆయన తనయుడు ప్రణయ్
రెడ్డి వారికి ఆత్మీయ స్వాగతం పలికారు. అక్కడ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.
మాజీ ఎమ్మెల్యే కుటుంబంతో కలిసి సజ్జల విందులో పాల్గొన్నారు. వీరితో పాటు
ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి,మాజీ ఎమ్మెల్యే
గుర్నాథ్ రెడ్డి, నాయకులు చవ్వా రాజశేఖర్ రెడ్డి,జిల్లా అగ్రి అడ్వైజరి బోర్డు
చైర్మన్ రాజశేఖర్ రెడ్డి తదితరులు ఈ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా
ఉరవకొండ నియోజకవర్గ వైస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పలువురు సజ్జలను
కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి సజ్జల బెంగళూరుకు బయలు దేరి
వెళ్లారు.