ఆ విషయంలో వైఎస్, నేనూ ఒట్టుపెట్టుకున్నాం
కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు
విజయవాడ : బంగారు భవిష్యత్తు కలిగిన ఏపీలోవైసీపీ పాలన చూస్తుంటే ఆవేదన
కలుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి
సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం విజయవాడలో
నిర్వహించిన ఏపీ కాంగ్రెస్ సమన్వయ, రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన
పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా కేవీపీ మాట్లాడుతూ సీఎం జగన్‌పై విమర్శలు చేశారు.
పోలవరం, విభజన హామీలు, రాష్ట్రానికి ప్రత్యేకహోదా తదితర అంశాల్లో సీఎం జగన్
కేంద్రాన్ని ఒక్క మాటా అనకపోవడం దారుణమని కేవీపీ రామచంద్రరావు ఆక్షేపించారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో పాటు తనకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్తు
ఇచ్చిందని చెప్పారు. అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించకూడదని, విమర్శించకూడదని
1996లో తామిద్దరం ఒట్టుపెట్టుకున్నామని కేవీపీ తెలిపారు.