నెల్లూరు : రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖ
మంత్రి ఆర్.కె.రోజా నిండ్ర మండలం అరూరు సచివాలయం పరిధిలోని కొత్త ఆరూరు,
ఓబియర్ కండ్రిక, ఆరూరు గ్రామాలలో ఆదివారం పర్యటించారు. ప్రజా సమస్యల
పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ
వైయస్.జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన “గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో
మంత్రి ఆర్.కె.రోజా కి ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. మహిళలు మంగళ హారతులు
పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ,
అధికారులు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో
ఎంపిపి, వైస్ ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్
సిపీ నాయకులు, కార్యకర్తలు, మండల అధికారులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.