ధాన్యం కొనుగోలు విషయంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించవద్దు
ఏ ఒక్క ధాన్యపు గింజను వృధాగా పోనివ్వం
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్
విజయవాడ : రైతే దేశానికి వెన్నెముక అని, రైతు లేనిదే రాజ్యం లేదని నమ్మే తమ
ప్రభుత్వం అన్ని విషయాల్లో రైతులకు అండగా ఉంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ
మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన ప్రతి
ఒక్క ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవరు కూడా ఆందోళన
చెందాల్సిన అవసరం లేదని మంత్రి జోగి రమేష్ గారు ప్రకటించారు. ఈ విషయంలో
ప్రతిపక్ష తెలుగుదేశం మరియు దాని తోక పార్టీలు చేస్తున్న చౌకబారు ఆరోపణలను
మంత్రి జోగి రమేష్ గట్టిగా తిప్పి కొట్టారు. ఈ మేరకు మంత్రి జోగి రమేష్
కార్యాలయం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో ధాన్యం కొనుగోలు విషయంలో ఎటువంటి
అలసత్వం ప్రదర్శించవద్దని, రైతులు పండించిన ప్రతి ఒక్క గింజని కొనుగోలు
చేసేదాకా అధికారులు విశ్రాంతంగా పనిచేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు, పౌర
సరఫరాల శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని వివరించారు.
ఇప్పటికే రెండుసార్లు పౌర సరఫరాల, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు
చేయడం జరిగిందని, ఏ ఒక్క ధాన్యపు గింజను వృధాగా పోనివ్వమని, ఈ సీజన్లో
పండించిన వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి రైతాంగానికి అండగా
ఉంటామని మంత్రి జోగి రమేష్ ఆ ప్రకటన లో స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుకు
సంబంధించి ఇప్పటికే ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో ప్రత్యేక కొనుగోలు విభాగం
ఏర్పాటు చేశామని, రైతులు సంక్షేమం దృష్టిలో ఉంచుకొని గతంలో ఎన్నడు లేని విధంగా
రైతుల సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయలు వివిధ పధకాలు ద్వారా అందించిన
ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దని మంత్రి జోగి రమేష్ ఈ సందర్భంగా గుర్తు
చేశారు.