పునరావాస కేంద్రాలలో ఉన్న వారికి ప్రభుత్వం ద్వారా అందించే సహాయాన్ని అంద
జేయండి
రాష్ట్ర విద్యుత్ అటవీ,విద్యుత్, శాస్త్ర సాంకేతిక, పర్యావరణ,భూగర్భ గనుల శాఖ
మంత్రి పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి
చిత్తూరు : మాండౌస్ తుఫాన్ బాధితులకుఉదారంగా నష్టపరిహారం అందించాలని గౌ.
రాష్ట్ర విద్యుత్ అటవీశాస్త్రసాంకేతిక,పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి
పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం అనంతపురం
జిల్లా సచివాలయం నుండి రాష్ట్ర అటవీ, విద్యుత్ పర్యావరణ శాస్త్ర సాంకేతిక
భూగర్భ గనులశాఖ మంత్రి చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి ఉష శ్రీ చరణ్,
త్తూరు పార్లమెంటు సభ్యు లు ఎన్. రెడ్డప్ప తో కలిసి వీడియో కాన్ఫ రెన్స్
ద్వారాతుఫాను పరిస్థితి పై చిత్తూరు, తిరుపతి,అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు తో
మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫ రెన్స్ లో మంత్రి మాట్లాడుతూ
మాండౌస్ తుఫాను వల్ల నష్టపోయిన వారికి ఉదారంగా నష్టపరిహారం చెల్లిం
చేలా,ఎన్యూమరేషన్ ప్రక్రియను పార దర్శకంగా కచ్చితం గా చేపట్టాలని బాధి తులకు
న్యాయం జరగాలని, పునరావాస కేంద్రాలలో ఉంటూ ఆశ్రయం పొందిన వారికి ప్రభుత్వం
ద్వారా అందిం చే ఆర్థిక సాయం అందజేయాలని పేర్కొన్నారు.
ఈ వీడియో కాన్ఫ రెన్స్ లో చిత్తూరు నుండి జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్
మాట్లాడుతూ జిల్లాలో 9 వతేది నుండి 10 వతేదీ ఉదయం వరకు 53.8 మి .మీ 10 వ
తేది 8 గంటలనుండి నేటి ఉదయం 8 గంటల వరకు 38.8 మి .మీ వర్షపాతం నమోదుఅయిందని,
మొదటి రోజు నగరి, నిండ్ర,విజయపురం మండలాల్లో ఎక్కువ గా వర్షపాతం నమో దు కావడం
జరిగిం దనిజిల్లాయంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ అన్నిముందస్తు చర్యలు తీసు
కొంటున్నామని, ఇప్పటి వరకు జిల్లాయంత్రాంగం అప్రమత్తంగా ఉందని, భూమి తడిగా
ఉండటం వల్ల కొద్ది పాటి వర్షం పడిన నీటి ప్రవాహం పెరుగు తుందనే ఉద్దేశ్యం తో
కాజ్ వే, వాగులు, వంకలు, చెరువులు, జలాశయాల వద్ద నిరంతర పర్యవేక్షణ చేయడం
జరుగుతున్నదని, ఈనెల 12వ తేదీ వరకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్ర
మత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు చేపట్టడం జరుగు తుందని,పునరావాస కేంద్రాలలో 416
మంది ఆశ్రయం పొం దారని,ఎక్కువగా 95% యానాది కుటుంబాల వారిని ముందస్తు
జాగ్రత్తగా పునరావాస కేంద్రా లకు తరలించడం జరిగిందని, వీరందరి కి ప్రభుత్వం
ద్వారా అందించే ఆర్థిక సా యాన్ని అందిస్తామ ని,పునరావాస కేంద్రాల నుండి వెళ్ళే
టప్పుడు ఒక కుటుంబము నకు రూ.2 వేలు, ఒకరికి వెయ్యి రూపాయల అందజేయడం
జరుగుతుందని, సహాయక చర్య ల్లో భాగంగా జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్ బృందా లు రావడం
జరిగింద ని, జిల్లాలో వ్యవసా య అనుబంధ శాఖ లు పంట నష్టం అం చనా ప్రక్రియను
చేప ట్టడం జరుగుతున్న దని, ప్రాథమిక అం చనా మేరకు జిల్లా లో 709 ఎకరాలు
వ్యవసాయ రంగం లో, 257 ఎకరాలు ఉద్యానవన శాఖ లో పశుసంవర్ధక శాఖ సంబంధించి 3
మేకలు చనిపోవడం జరిగిందని,ఇండ్లకు సంబంధించిన 4 కచ్చా ఇండ్లు దెబ్బ తినడం
జరిగిందని చెప్పారు.
మైనర్ ఇరిగేషన్ 2 ట్యాంకుల్లో మైనర్ రిపేర్లు కలవని, పెద్ద గా ఎక్కడ సమ స్య
రాలేదని, విద్యుత్ శాఖకు సంబంధించి 157 ఫోల్స్ డ్యామేజ్ కాగా 100 శాతం
వాటిల్ని పునరుద్ధ రించడం జరిగిందని, నిరంతరంగావిద్యుత్
సరఫరాచేస్తున్నామని,ప్రజలకు క్లోరినే షన్ చేసిన నీటిని అందజేస్తున్నామని
సురక్షిత త్రాగునీరు అందజేస్తున్నామని ఆర్ డబ్ల్యూఎస్ కు సంబంధించి పైప్లైన్
లీకేజ్ లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసుకొని త్రాగునీరు సరఫరా
చేయడం జరుగుతున్నదని, వర్షాల వల్ల ప్రబలే వ్యాధుల నుండి ప్రజలను కాపాడేం దుకు
వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసి పి హెచ్ సి లకు వచ్చే కేసుల పై ప్రత్యే క
దృష్టి సారించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, వర్షం నిలిచిన వెంటనే
పారిశుధ్యం పనుల ను చేపట్టేలా డీపీఓ మున్సిపల్ కమిష నర్లను సూచించడం జరిగిందని
కలెక్టర్ మంత్రికివివరించారు. ఈ వీడియో కాన్ఫ రెన్స్ లో జిల్లా కలెక్టర్ తో
పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, డి ఆర్ ఓ
ఎన్.రాజశేఖర్ వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.