సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
విజయవాడ : సీఎం జగన్ మోహన్ రెడ్డి రూ.8,800 కోట్లతో జేఎస్డబ్ల్యు
ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ రాష్ట్ర
కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ సాధనకోసం తమ పార్టీ
చేపట్టిన పాదయాత్రకు రాష్ట్ర ప్రభుత్వ స్పందించిందని పేర్కొన్నారు. పాదయాత్రలో
పాల్గొన్న ప్రతిపక్ష పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లోగా
నిర్దేశిత సమయానికి కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయాలని, అది
పూర్తికాకుండా ఓట్లను అడితే నైతిక హక్కు వైసీపీకి లేదని పేర్కొన్నారు.