ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు
విజయవాడ : విద్యుత్ ను పొదుపు చేయడం ద్వారా వినియోగంపై ప్రజలలో మార్పు
తీసుకువచ్చి ఇంధన పొదుపుతో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. జాతీయ ఇంధన పొదుపు
వారోత్సవంలో భాగంగా రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని
విద్యార్థులతో నిర్వహించిన విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీని బుధవారం జిల్లా
కలెక్టర్ డిల్లీరావు ఆయన కార్యాలయం నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన సభలో జిల్లా కలెక్టర్
డిల్లీరావు మాట్లాడుతూ ఇంధనాన్ని పొదుపు చేయడం ద్వారా పర్యావరణాన్ని
కాపాడుకుని బావితరాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందన్నారు.
గాలి నీరు బొగ్గు వంటి సహజ వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం
జరుగుతుందన్నారు. అదృష్టావశాత్తు మన దేశంలో సూర్యకిరణాల కాంతి ఎక్కువ సమయం
ఉండడంతో విద్యుత్‌ను ఎక్కువ ఉత్పత్తి చేసుకునే అవకాశం కలిగిందన్నారు. గ్యాస్,
బొగ్గు, క్రూడ్ ఆయిల్ వంటి సహజ వనరులు ఇప్పటికే అంతరించి పోతున్నాయన్నారు.
విద్యుత్ విలువ గురించి ప్రజలకు తెలియజేసి వృదా చేయకుండా పొదుపు చేసుకునేలా
విద్యుత్ ను అవసరాలకు సరిపడా మాత్రమే వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
విద్యుత్ పొదుపు ద్వారానే భవిష్యతుకు వెలుగులను ఇవ్వగలుగు తామన్నారు. విద్యుత్
వినియోగంపై స్థిరత్వం ఏర్పాడితే పరిరక్షనకు మార్గం సుగమం అవుతుందన్నారు.
విద్యార్థి దశ నుండే విద్యుత్ వినియోగంపై అవగాహన కలిగివుండాలన్నారు. సహజంగా
ఫ్యాన్లు, ఫ్రిడ్జ్‌లు, టీవీలు, కంప్యూటర్లు, ఏసిలు వంటివి వాడకం వలన విద్యుత్
బిల్లులు అధిక శాతం వస్తుందన్నారు. గృహలలో వినియోగించే ఏసి మిషన్లు, ఫ్రిడ్జ్,
గీజర్, వాషింగ్ మిషన్, ఫ్యాన్లు, లైట్లు, ఎలక్ట్రిక్ కుక్కర్లు వంటి పరికరాలను
వినియోగంచే సమయంలో పొదుపు చిట్కాలను అవలంభించాలన్నారు. పగటిపూట వీలైనంత సమయం
విద్యుత్ లైట్ల వినియోగాన్ని తగ్గించాలని రాత్రి సమయంలో సాధ్యమైనంత త్వరలో
దినచర్యలను ముగించుకుని విద్యుత్ వాడకాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం
ఉందన్నారు.
కలెక్టర్ కార్యాలయం నుండి విద్యార్థిని విద్యార్థులతో ప్రారంభమైన ఇంధన పొదుపు
అవగాహన ర్యాలీ ఇందిరాగాంధీ స్టేడియంకు చేరుకుంది. ఇంధన పొదుపు సామాజిక
భాధ్యతగా స్వీకరిస్తానని, ఇంధన పొదుపు ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించి
భావితరాలకు సమస్యలను లేకుండా చేయడంలో తన వంతు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్
డిల్లీరావు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.కార్యక్రమంలో ఏపి ట్రాన్కో
జెయండి (హెచార్) ఐ. పుద్వీతేజ్, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ జెయండి
మల్లారెడ్డి, ఏపి ఇఆర్‌సి ఎడ్వయిజరీ కమిటీ మెంబర్ లక్ష్మిభీమేష్,
ఏపిసిపిడిసిఎల్ సూపరింటెండెంట్ ఇంజనీయర్ శివప్రసాద్ రెడ్డి, డిప్యూటి
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సుధాకర్, హనుమంతయ్య, ఎడిఇలు యు. శ్రీనివాస్, టి
శివరామకుమార్, ఇంధన పరిరక్షణ మిషన్ అధికారులు వివిధ కళాశాలలకు చెందిన
విద్యార్థులు పాల్గొన్నారు.