బిఆర్ఎస్ పార్టీ ద్వారా దేశం సుబీక్షంగా ఉండాలని కాంక్షిస్తూ ప్రార్థనలు
న్యూఢిల్లీ : న్యూఢిల్లీలో బీఆర్ఎస్ జాతీయ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ
కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ బుధవారం నాడు బీఆర్ఎస్
పార్టీ మైనారిటీ నేతలతో కలిసి పాల్గొన్నారు. అదేవిధంగా ఢిల్లీలోని హజ్రత్
నిజాముద్దీన్ దర్గాలో మైనార్టీ నాయకులతో కలిసి హోం మంత్రి ప్రత్యేక ప్రార్థనలు
చేశారు .బిఆర్ఎస్ పార్టీ ద్వారా దేశవ్యాప్తంగా మంచి కార్యక్రమాలు జరిగి
భారతదేశం సుభిక్షంగా ఉండాలని ఆయన ప్రార్థన చేశారు .అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ
జాతీయ అధ్యక్షుడు కేసిఆర్ ఆయన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలని, తెలంగాణ
రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని హోం మంత్రి ప్రార్థనలు చేశారు.ఈ
సందర్భంగా హోం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో
దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని,
కేసిఆర్ ప్రధాన మంత్రి అవుతరన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రకటనతో
దేశవ్యాప్తంగా సెక్యులర్ రాజకీయ పార్టీలు, సెక్యులర్ మనస్తత్వం ఉన్న
ప్రజల్లో ఆనందం వెల్లివిరిస్తోందని తెలిపారు. కేంద్రం, ఆ పార్టీ నేతలపై
మతోన్మాదానికి వ్యతిరేకంగా గళం విప్పే ధైర్యం ఈ రోజుల్లో ఎవరికీ లేదనీ ,
కెసిఆర్ కే అది సాధ్యమైందన్నారు.
గత కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలు, పక్షపాత
ధోరణిపై ధీటైన ప్రకటనలు చేస్తూ పేరు తెచ్చుకున్న re 2014లో కేంద్రంలో బీజేపీ, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్
అధికారంలోకి వచ్చాయన్నారు. ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద
అసాధారణ అభివృద్ధిని సాధించగా, కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల ప్రపంచ
దేశాల్లో దేశ ప్రతిష్ట దెబ్బతింటోందనీ విమర్శించారు.కే సి ఆర్ సెక్యులర్
నాయకుడని, తెలంగాణలో అన్ని మతాల ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి సమాన
అవకాశాలు కల్పించారని, దాని వల్లనే తెలంగాణ ప్రజలు అభివృద్ధి సాధించారని
మంత్రి అన్నారు. భవిష్యత్తులో అన్ని మతాల సంక్షేమం, దేశాభివృద్ధికి
బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఇది ముఖ్యంగా దేశంలోని రైతులు,
సైనికులు మరియు పేద ప్రజల సంక్షేమం కోసం, వారి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి
పని చేస్తుందనీ పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మసీహుల్లాఖాన్, మైనార్టీ
ఆర్ధిక సంస్థ చైర్మన్ఇంతియాజ్ ఇషాక్, మలక్ పేట నియోజకవర్గ ఇంచార్జ్ ఆజం అలీ,
జహంగీర్, సుల్తాన్ ఖాద్రీ షతారీ, సయ్యద్ మునీరుద్దీన్, ఆరీఫుద్దీన్,
సబిలుద్దీన్ ఫరీద్, బద్రుద్దీన్, నవాబ్ షరీఫ్ అర్షద్ ఖాన్ ., అబ్దుల్ బాసిత్,
మసీహుద్దీన్ ఖురేషీ, అథరుల్లా, అబ్దుల్ లతీఫ్ షర్ఫాన్, సయ్యద్ ఎజాజ్, ఇతరులు
హజ్రత్ నిజాముద్దీన్ దర్గాలో చేసిన ప్రార్థనలలో పాల్గొన్నారు.