పేలుడు పదార్థాలున్నవాటిని తిప్పికొట్టాం : జెలెన్స్కీ
కీవ్ : ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా బుపెద్దఎత్తున డ్రోన్ దాడులకు
పాల్పడింది. వీటిలో కొన్ని ఈ నగరంలోని ఐదు భవంతులకు పాక్షికంగా నష్టం
కలిగించగా, మిగిలినవాటిని ఉక్రెయిన్ సైన్యం అడ్డుకోగలిగింది. ఉక్రెయిన్
రాజధాని కీవ్‌పై రష్యా బుధవారం పెద్దఎత్తున డ్రోన్ దాడులకు పాల్పడింది.
వీటిలో కొన్ని ఈ నగరంలోని ఐదు భవంతులకు పాక్షికంగా నష్టం కలిగించగా,
మిగిలినవాటిని ఉక్రెయిన్ సైన్యం అడ్డుకోగలిగింది. ప్రాణనష్టంపై ఎలాంటి
సమాచారం లేదు. ఇతర దాడులకంటే వీటి తీవ్రత తక్కువ. ఇరాన్లో తయారైన 13
డ్రోన్లను తమ బలగాలు ఛేదించి, నిర్వీర్యం చేయగలిగాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు
వొలొదిమిర్ జెలెన్స్కీ వీడియో సందేశంలో వెల్లడించారు. వీటిలో పేలుడు
పదార్థాలు నింపి ఉన్నాయని చెప్పారు. డ్రోన్ల శకలాలు కొన్ని భవనాలపై పడి నష్టం
కలిగించాయని వివరించారు. వీటిని ప్రయోగించినవారిని ఉగ్రవాదులుగా
అభివర్ణించారు. మరోవైపు- యుద్ధం మొదలయ్యాక శరణార్థులుగా దేశ, విదేశాలకు
వెళ్లినవారిలో 50 లక్షల మంది తిరిగి తమతమ ఇళ్లకు చేరుకుంటున్నారని ఐరాస
తెలిపింది. యుద్ధఖైదీల అప్పగింతలో భాగంగా 64 మంది ఉక్రెయిన్ సైనికుల్ని
తాజాగా విడుదల చేశారు.
*నిరాడంబరంగా క్రిస్మస్ చేసుకుని ఆ డబ్బును ఉక్రెయిన్‌కు ఇద్దాం : పోప్రోమ్*
ఈ ఏడాది క్రిస్మస్ పండుగను నిరాడంబరంగా చేసుకుని, తద్వారా ఆదా అయ్యే డబ్బును
ఉక్రెయిన్‌కు విరాళంగా ఇద్దామని పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. బహుమతులపై
ఖర్చును తగ్గించుకుని, కష్టాల్లో ఉన్న ఉక్రెయిన్ ప్రజల్ని ఆదుకుందామని తన
సందేశంలో కోరారు. ‘ఉక్రెయిన్ ప్రజలు ఆకలితో ఉన్నారు. చలికి వణుకుతున్నారు.
వైద్యులు-నర్సులు అందుబాటులో లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారిని
మనం మర్చిపోవద్దు. క్రిస్మస్ పండుగ సంబరాలు చేసుకోవడం బాగుంటుంది. ఈసారి
వాటిని కాస్త తగ్గించుకుందాం’ అని అన్నారు.