ఐఎన్ఎస్ఏ అధ్యక్షురాలు డాక్టర్ చంద్రిమా షాహ
యూరప్ దేశాల ప్రజలతో పోలిస్తే భారతీయుల్లో వైరస్‌లను తట్టుకునే శక్తి
ఎక్కువని ‘ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ’(ఐ.ఎన్.ఎస్.ఎ.) అధ్యక్షురాలు,
ప్రముఖ కెమికల్ బయాలజిస్టు డాక్టర్ చంద్రిమా షాహ పేర్కొన్నారు. చైనాలో
ముదురుతున్న కొవిడ్ పరిస్థితులతో భారత్‌లోనూ కొందరు మళ్లీ ఆ వైరస్ బారినపడే
అవకాశాల్ని కొట్టిపారేయలేమని తెలిపారు. దేశంలో పెద్ద ఎత్తున జరిగిన టీకాల
కార్యక్రమంతో ప్రాణాంతక పరిస్థితులు మాత్రం తలెత్తవని అన్నారు. విశాఖపట్నం
లోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఐ.ఎస్.ఎస్.ఎ. 88వ వార్షిక సాధారణ సమావేశాల్లో
ఆమె అధ్యక్షోపన్యాసం చేశారు. కొవిడ్ మహమ్మారిని తరిమికొట్టడానికి, ప్రాణ
నష్టాన్ని తగ్గించడానికి శాస్త్రవేత్తలు చేసిన కృషి ప్రశంసనీయమని కొనియాడారు.
కార్యక్రమంలో ఎన్.ఐ.ఒ.(సముద్ర అధ్యయన జాతీయ కేంద్రం) సంచాలకులు
సునీల్‌కుమార్ సింగ్, ఐ.ఎన్.ఎస్.ఎ. ఉపాధ్యక్షుడు ఆచార్య డి.వి.ఖక్కర్లు
పాల్గొన్నారు. శాస్త్ర సాంకేతిక విభాగం విశ్రాంత కార్యదర్శి ఆచార్య అశుతోశ్
శర్మ ఐ.ఎన్.ఎస్.ఎ. తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు
డాక్టర్ చంద్రిమా షాహ ప్రకటించారు.