వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య
* స్వచ్ఛంద రక్తదాతల కోసం పార్టీ స్పెషల్ వెబ్సైట్
* విద్యార్థులపేర్లు రిజిస్టర్ చేసుకునే ప్రక్రియకు గుంటూరు వేదికగా శ్రీకారం
* ప్రతిజిల్లాలో ప్రారంభించాలని పానుగంటి పిలుపు
గుంటూరు : ప్రతి ఇంటికీ… ప్రతి వర్గానికీ… ప్రతి ప్రాంతానికీ… ప్రయోజనం చేకూర్చుతున్న గొప్ప మనసున్న
ముఖ్యమంత్రి వైయస్ జగన్ 50వ పుట్టినరోజు అంటే జగానికే అదొక వేడుక వంటిదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య వెల్లడించారు. ప్రత్యేకించి మా విద్యార్థి లోకానికైతే ఏకంగా
పర్వదినమేనని ఆయన ప్రకటించారు. అందుకే ఈ సందర్భంగా తాము పార్టీ పిలుపు మేరకు విభిన్న రీతిలో ఫిజికల్‌గా రక్తదానం చేయడంతో పాటు ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి రక్తం అవసరమైనా దానం చేసేందుకు వీలుగా దాతల వివరాలు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్లో నమోదు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మన దేవుడిచ్చిన మేనమామ జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ పేరును స్వచ్ఛందంగా రిజిస్టర్ చేయించుకోవాలంటూ విద్యార్థి లోకానికి, ప్రతి జిల్లాలో తక్షణమే ఈ ప్రక్రియను ప్రారంభించాలని ఆయా ప్రాంతాల విద్యార్థి విభాగం నేతలకు పానుగంటి చైతన్య పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ జన్మదినోత్సవం
సందర్భంగా స్వచ్ఛంద రక్తదాతల కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా వైయస్ఆర్సిపి బ్లడ్ డొనేషన్.కామ్ అనే వెబ్‌సైట్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ వెబ్సైట్లో తమ పేర్లు రిజిస్టర్ చేయించుకునే కార్యక్రమానికి శుక్రవారం గుంటూరు వేదికగా పానుగంటి చైతన్య శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా శంకర్‌విలాస్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని, “అత్యవసర సమయంలో రక్తదానం చేయడం సామాజిక బాధ్యతగా గుర్తించి ఎప్పడవసరమైతే అప్పుడు ఎక్కడ అవసరమైతే అక్కడ, ఎవరికి అవసరమైతే వారికి రక్తదానం చేసేందుకు తాము సిద్ధం” అని ప్రతిజ్ఞ చేసి తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు.