విజయవాడ : అమరావతినే ఏకైక రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని అమరావతి పరిరక్షణ
సమితి ఆధ్వర్యంలో రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం నేటికీ మూడు సంవత్సరాలు
పూర్తయిన సందర్భంగా నేడు ఢిల్లీ వేదిక గా రైతులు,మహిళలు ధర్నా చేస్తున్న
ఉద్యమానికి సంఘీభావంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్న గూడెం గ్రామం
లో శనివారం ఉదయం సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు,
అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేత ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు ఆధ్వర్యంలో
నిరసన ప్రదర్శన నిర్వహించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆళ్ళ వెంకట గోపాల
కృష్ణారావు మాట్లాడుతూ రాజధానిలో 27 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు భూములు
రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు రాజధానికి త్యాగం చేశారని, గత తెలుగుదేశం
ప్రభుత్వం ప్రస్తుత వైసిపి ప్రభుత్వం అధికారంలో వచ్చేనాటికి ఒక కోటి 25 లక్షల
చదరపు అడుగులు నిర్మాణం పూర్తి చేసి అందులో సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్,
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్ నిర్మాణం పూర్తి చేసిందని
ఇప్పటివరకు అమరావతి నిర్మాణానికి రూ. 9,165 కోట్లు వ్యయం చేశారని అన్నారు. ఇంత
అభివృద్ధి చేసిన తర్వాత మళ్లీ మూడు రాజధానుల నేపంతో కార్యనిర్వాహక రాజధాని
పేరిట విశాఖలో 1.30 లక్షల చదరపు అడుగుల మేర కొత్త కార్యాలయాలను తీసుకోవడానికి
ప్రయత్నించటం చాలా దారుణం అన్నారు. గత మూడు సంవత్సరాలుగా రాజీ లేని పోరాటం
చేస్తున్న అమరావతి రైతులు, మహిళలు మనోవేదనను ఇప్పటికైనా గమనించి మూడు రాజధానుల
ప్రకటన రద్దుచేసి అమరావతి నే ఏకైకే రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంపీటీసీ సబ్యులు పుసులూరు లక్ష్మీనారాయణ
మాట్లాడుతూ అమరావతి రాజధాని బిక్ష కాదు చట్టబద్ధ హక్కు అని ఇప్పటికైనా రాష్ట్ర
ప్రభుత్వం గుర్తించి నవ్యాంధ్రలోని 13 జిల్లాల ప్రజల మనోభావాలను నేడు
ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతుల, మహిళల గుండె చప్పుడును గమనించి రాష్ట్ర
ప్రభుత్వం మూడు రాజధానులు అనే నినాదం విడనాడాల ని కోరారు. ఈ కార్యక్రమంలో
పి.ఎ.సి.ఎస్ మాజీ అధ్యక్షులు తుమ్మల దశరథ రామయ్య, జేఏసీ నేతలు కసుకుర్తి
అర్జునరావు, ఆలపాటి రాంబాబు, కనకవల్లి శేషగిరిరావు ,కొలుసు బలరామ్, చిలకలపాటి
శ్రీనివాసరావు, నత్త అబ్రహం, కసుకుర్తి నరసింహారావు, మైనేని కృష్ణారావు,
దోమవరపు బాబురావు, గోళ్ళ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.