పెనుకొండ నియోజకవర్గ విస్తృత స్ధాయి సమావేశంలో పాల్గొన్న వై.యస్.ఆర్
కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా
రెడ్డి, శ్రీ సత్య సాయి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,
ఎమ్మెల్యే శంకర నారాయణ
పెనుకొండ : వైసీపీలో వర్గవిభేదాలు మరోసారి బయటపడ్డాయి. పెనుకొండలో వైసీపీ
విస్తృత సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి హాజరవుతున్న సమయంలో ఆయన కాన్వాయ్‌పై
చెప్పులు విసిరిఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా
పెనుకొండ వైసీపీలో అసమ్మతి రోడ్డెక్కింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే శంకర నారాయణ
అనుకూల, వ్యతిరేక వర్గాల కుమ్ములాటలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి
పరాభవం తెచ్చిపెట్టాయి. పెనుకొండలో శనివారం వైసీపీ విస్తృతస్థాయి సమావేశానికి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శంకర నారాయణపై
ఫిర్యాదు చేసేందుకు ఆయన వ్యతిరేక వర్గీయులు శ్రీకృష్ణదేవరాయల కూడలిలో
కాపుకాశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనుకూల వర్గీయులు కూడా అక్కడికి
చేరుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ రాగానే ఇరువర్గాలు
చుట్టుముట్టాయి. ఈ క్రమంలో తీవ్ర తోపులాట జరిగింది. అసమ్మతి నేతలు మంత్రి
పెద్దిరెడ్డికి చెప్పులు చూపించడం చర్చనీయాంశమైంది. వై.యస్.ఆర్ కాంగ్రెస్
పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్, రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన వై.యస్.ఆర్
కాంగ్రెస్ పార్టీ పెనుకొండ నియోజకవర్గ విస్తృత స్ధాయి సమావేశంలో మంత్రి
పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జడ్పీ చైర్
పర్సన్ గిరిజమ్మ, పెనుకొండ నియోజకవర్గ పరిశీలకులు బాబిరెడ్డి, మాజీమంత్రి
నర్సెగౌడ్, ఏ డీ సీ సీ బ్యాంక్ చైర్ పర్సన్ లిఖిత, వివిధ చైర్మన్ లు, స్థానిక
ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, తదితరులతో కలిసి స్ధానిక శాసనసభ్యులు, మాజీ
మంత్రి సత్య సాయి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలగుండ్ల
శంకర నారాయణ పాల్గొన్నారు.