ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ
విజయవాడ : విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈనెల 15
నుండి 19 వరకు ఐదు రోజుల పాటు అమ్మవారి భవాని దీక్ష విరమణలు అత్యంత వైభవంగా,
దిగ్విజయంగా నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ
తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ , పోలీస్ కమిషనర్, విఎంసి కమిషనర్, ఇతర
శాఖల వార్లు వారి యొక్క సహకారాలను అందించి భవాని దీక్ష విరమణలు కార్యక్రమం
విజయవంతం చేశారు. వీరందరికీ పేరుపేరునా దేవస్థానం తరఫున హృదయ పూర్వక
ధన్యవాదములు తెలిపారు. అలాగే ఈ ఉత్సవములు విజయవంతం కావడానికి సహకరించిన
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి దేవస్థానం సిబ్బంది, ఉచిత సేవలు అందించిన
రెడ్ క్రాస్ సొసైటీ వారికి కూడా ధన్యవాదములు తెలిపారు. భవానీ దీక్షల విరమణలలో
చివరి రోజు సోమవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో దేవస్థానము నందలి చండి
హోమయాగశాల నందు ఆలయ వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పూర్ణాహుతి కార్యక్రమం
శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి
దర్భముళ్ల భ్రమరాంబ, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీరు ఎల్. రమాదేవి, సహాయ
కార్యనిర్వాహణాధికారి పి. సుధారాణి, పర్యవేక్షకులు, 1టౌన్ సి.ఐ సురేష్ రెడ్డి
, గురుభవానీలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. గత సంవత్సరము సుమారు 4 లక్షల పైగా
భవానీభక్తులు వచ్చియున్నారు. ఈ సంవత్సరము ఐదు రోజులకు భవాని, సాధారణ భక్తులతో
కలిపి సుమారుగా మొత్తం 5 లక్షల 40 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ
కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ తెలిపారు. గతంలో ఉదయం టల నుండి
భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడం జరిగిందనీ, కానీ ఈ సంవత్సరం ఉదయం రెండు
గంటల నుండి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించి భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం
జరిగినది. గత సంవత్సరం కంటే ఈ ఏడాది భక్తులు అధికముగా విచ్చేసి అమ్మవారిని
దర్శించుకున్నారు. ఈ 5 రోజులలో సుమారు 15 లక్షల పైగా లడ్డూలు భక్తులు కొనుగోలు
చేసి ఉన్నారు. గత సంవత్సరం 13.5 లక్షల లడ్డూలు కొనుగోలు చేసి ఉన్నారు. ఈ
ఐదు రోజులలో సుమారు 1 లక్షకు పైగా భక్తులు తలనీలాలు సమర్పించి ఉన్నారు. గత
సంవత్సరం 56,000 మంది తలనీలాలు సమర్పించుకునియున్నారు. సుమారు 45లక్షల రూపాయల
విలువ గల రూ. 100, 300, 500 దర్శనం టికెట్లును భక్తులు కొనుగోలు
చేసియున్నారు. దేవస్థానపు బస్సులు 8 కాక, నాలుగు బస్సులు ఆర్ టీ సీ వారి నుండి
అద్దెకు తీసుకొని మొత్తం 12 బస్సులు భవానీ భక్తుల సౌకర్యం నిమిత్తం అన్ని
ప్రదేశముల నుండి ఉచితంగా నడపడం అయినది. హోల్డింగ్ ఏరియా, టి.టి.డి. స్థలం,
శివాలయం మెట్లక్రింద షెడ్లు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ 5 రోజులలో
సుమారు 23,700 వేలమందికి అన్న ప్రసాదం, 80,000 మందికి ఉచిత ప్రసాదం పంపిణీ
చేయడం జరిగినది. మజ్జిగ ప్యాకెట్లు కూడా భక్తులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు.