గుడ్న్యూస్ చెప్పింది. పీఎం ఆవాస్ యోజన పథకానికి ఈ సారి బడ్జెట్లో నిధులను
భారీగా పెంచింది.
గత బడ్జెట్లో పీఎం ఆవాస్ యోజనకు రూ. 48 వేల కోట్ల కేటాయించగా.. ఈ ఏడాది ఆ
మొత్తాన్ని 66 శాతం పెంచి రూ.79వేల కోట్లు కేటాయించారు. వడ్డీ రేట్లు పెరిగిన
వేళ గృహ కొనుగోలుదారులకు ఇది ఊరట కల్పించే అంశం.ఏకలవ్య పాఠశాలల్లో భారీ ఎత్తున ఉపాధ్యాయ నియామకాలు..
ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాం. ఆదివాసీ
ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కోసం రూ.15వేల కోట్లు. ఏకలవ్య పాఠశాలల్లో భారీ
ఎత్తున ఉపాధ్యాయ నియామకాలు చేపడుతున్నామన్నారు. డిజిటల్ ఎపిగ్రఫీ మ్యూజియం
ఏర్పాటు చేస్తామని తెలిపారు. కారాగాగాల్లో మగ్గిపోతున్న పేద ఖైదీలకు ఆర్థిక
చేయూత అందిస్తాం.
150కు పైగా మెడికల్ కాలేజీలకు అనుమతి..
2014 నుంచి దేశవ్యాప్తంగా 150కు పైగా మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చాం.
త్వరలోనే ఐసీఎంఆర్ ప్రయోగశాలల విస్తృతిని మరింత పెంచుతాం. ఫార్మారంగంలో
ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇస్తాం. వైద్య కళాశాలల్లో ఆధునిక సౌకర్యాలు
కల్పిస్తాం. అధ్యాపకుల శిక్షణకు డిజిటల్ విద్యావిధానం, జాతీయ డిజిటల్
లైబ్రరీ తీసుకొస్తాం
👉ఇన్కంటాక్స్ (వచ్చే సంవత్సరానికి)మినహాయింపు రూ 5.00 లక్షలు యదాతథం.ఎటువంటి
మార్పు లేదు
కొత్త విధానంలో పొదుపు మొత్తాలపై రిబేట్ రూ 7.00 లక్షలకు పెంపు.
స్టాండర్డ్ డిడక్షన్ రూ 3.00 లక్షలు
6 స్లాబుల్లో టాక్స్
0 – 3.00లక్షలు – లేదు
3.00 – 6.00లక్షలు – 5%
6.00 – 9.00 లక్షలు – 10%
9.00 – 12.00 లక్షలు – 15%
12.00 – 15.00 లక్షలు – 20%
15.00 లక్షల పైన 30%.