చెక్కు ను అందచేసిన వెలంపల్లిచంద్రబాబు నీచ రాజకీయాలను మహిళలు రానున్న రోజులలో తిప్పికొడతారు
మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించిన మహిళ పక్షపాతి జగన్ మోహన్ రెడ్డి : మాజీ
మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు
విజయవాడ : స్థానిక 53వ డివిజన్ కొత్తపేట చేపల మార్కెట్ వద్ద శుక్రవారం నాడు
37,52, 53వ డివిజన్ల లోని స్వయం సహాయక సంఘాల లోని అక్కా చెల్లెమ్మలకు
వైఎస్ఆర్ ఆసరా పధకం క్రింద మూడవ విడత రుసుము విడుదల కార్యక్రమం జరిగింది. ఈ
కార్యక్రమానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, ఎన్టీఆర్ జిల్లా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా
పాల్గొని 280 స్వయం సహాయక సంఘాల లోని 2800 మంది అక్కా చెల్లెమ్మలకు 2 కోట్ల 87
లక్షల 22వేల 3 వందల 36 రూపాయల విలువైన చెక్కు ను అందచేశారు. అనంతరం
ముఖ్యమంత్రి చిత్ర పటానికి మహిళలతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం
వెలంపల్లి మాట్లాడుతూ జగనన్న పాదయాత్ర లో ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా
రుణాలను మాఫీ చేస్తున్నాడన్నారు. మహిళలకు తోడుగా వుండే ఏకైక వ్యక్తి జగన్
మోహన్ రెడ్డి అని కొనియాడారు. మహిళ పట్ల చిత్తశుద్ధితో పని చేస్తున్న వ్యక్తి
జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. గతంలో మహిళను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు
అని అన్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలను మహిళలు రానున్న రోజులలో
తిప్పికొడతారన్నారు.14 ఏళ్లలో చంద్రబాబు మహిళకు ఏమి మంచి చేసారో లోకేష్
చెప్పాలి అని ప్రశ్నించారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించిన మహిళ
పక్షపాతి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన
భాగ్యలక్ష్మి, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు మండేపూడి చటర్జీ, మహదేవ్
అప్పాజీ,52వ డివిజన్ పార్టీ ఇంచార్జీ తంగేళ్ళ రామ చంద్రరావు, క్లస్టర్
ఇంచార్జ్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, తదితర పార్టీ నాయకులు,
కార్యకర్తలు, నగర పాలక సంస్థ అధికారులు, స్వయం సహాయక సంఘాల అక్కా చెల్లెమ్మలు
పాల్గొన్నారు.