స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) రిక్రూట్మెంట్ 2022లో భాగంగా సర్కిల్ ఆధారిత ఆఫీసర్ 1,422 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ నవంబర్ 07, 2022. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ sbi.co.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దశలవారీగా జరిగే రిక్రూట్మెంట్ ప్రక్రియ కోసం అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో నవంబర్ 7వ తేదీ లోపు నమోదు చేసుకోవాలి.