చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పమని, ఈ మేరకు విద్యారంగంలో ఆయన
చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ
ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా సోమవారం
ఆయన పలు అంశాలు వెల్లడించారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకే పరిమితమైన
సీబీఎస్ఈ సిలబస్ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెట్టి మారుమూల ప్రాంతాల్లోని పేద
విద్యార్థులకు కూడా అందుబాటులోకి తెచ్చారని అన్నారు.పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 43 లక్షల మందికి చికిత్స
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి
ఖరీదైన వైద్యాన్ని సైతం ప్రజలను మరింత అందుబాటులోకి తెచ్చారని విజయసాయి రెడ్డి
అన్నారు. డాక్టర్ వైఎస్సార్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా గత 9
నెలల్లో 43,10,363 మందికి చికిత్స అందించారని అన్నారు. అలాగే 7.51 లక్షల
మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మెడికల్ రిపోర్టులను వాట్సప్
ద్వారా నేరుగా పంపించారని అన్నారు.
బ్రిటిష్ రాజవంశపు కిరీటంపై ఉన్న కోహినూర్ వజ్రం తమది కాదని, దొంగలించడం
ద్వారా సముపార్జించినదేనని ఆ రాజవంశీలకు స్పష్టంగా తెలుసన్న విషయం ప్రిన్స్
హారీ రాసిన పుస్తకం స్పేర్ ద్వారా నిరూపించబడిందని విజయసాయి రెడ్డి
పేర్కొన్నారు. మన దేశం నుంచి దొంగిలించబడిన విలువైన వస్తువులు, సంపద తిరిగి
తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ చేపట్టాలని కోరారు.